ఎన్నికల్లో ఏ సీటు ఎవరికి ఇస్తారు అనేది సీఎం జగన్ ఇష్టం అని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సత్తెనపల్లి సీటు కోసం ఎవరైనా ప్రయత్నించవచ్చని అన్నారు. కానీ జగన్ దే తుదినిర్ణయం అని తెలిపారు.
సీటు సంగతి ఎలా ఉన్నా తాను మాత్రం ప్రాణం ఉన్నంత వరకు సత్తెనపల్లి లోనే ఉంటానని వాక్యానించారు. రేపు సీఎంతో జరిగే ఎమ్మెల్యేల సమావేశం, సాధారణ సమావేశం అని, సంచలన నిర్ణయాలు ఏమీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు.
నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లి నా నివాస ప్రాంతమేనని.. రాజకీయాలతో సంబందం లేదని తెలిపారు.సత్తెనపల్లి నా ప్రాంతం గా నేను నిర్ణయించుకున్నాను…సీట్ల విషయం లో వైయస్ జగన్ దే అంతిమ నిర్ణయమని చెప్పారు. నేనైనా ఇంకొకరైనా దానికి అతీతులం కాదు….ఎన్నికల సమీపిస్తున్న వేళ సీట్ల కోసం ఎవరైనా పోటీ పడవచ్చన్నారు.