చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి టిడిపి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చంద్రబాబుకు చురకలు అంటించారు అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో చంద్రబాబు చేసింది అట్టర్‌ఫ్లాప్ షో.. సత్తెనపల్లిలో జనం రాకపోయినా మహాద్భుతం అని బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు పేదల్ని ధనవంతుల్ని చేశారా?.. కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు చంద్రబాబే కారణం అని ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు. కోడెల ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని నిలదీశారు. కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు.. బాబు కన్నా వందరెట్లు నీతిమంతుడిని నేను అని తెలిపారు అంబటి రాంబాబు.ఇది సత్తెనపల్లి లో చంద్రబాబు కు పట్టిన ఖర్మ… చంద్రబాబు ప్రసంగం అంతా అబద్దాల పుట్ట అన్నారు. చంద్రబాబు నిజం చెప్తే తల వంద ముక్కలుఅవుతుందని ఓ ముని శాపం ఉంది… యోధులను ఓడించి జగన్ ప్రజల మనసు గెలిచాడని కొనియాడారు.