మే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు – నాదెండ్ల

-

మే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని ప్రకటన చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పోలవరం ఆంద్ర రాష్ట్రానికి జీవనాడి అని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేసేసిందని ఆగ్రహించారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును 41.15 కు మొదటి దశలో పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా.. అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే ప్రాజెక్టు మరమత్తు కోసం 2,030 కోట్ల రూపాయలు పోలవరం అధారిటీ నుండి సాంక్షన్ రాకపోయినా జీవో విడుదల చేయడం అవినీతి కాదా..పోలవరం పూర్తయిపోతుందని మభ్యపెట్టడాన్ని ముక్తకంఠంతోటి ఖండించాలన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు… అదే రోజు సాయంత్రం కొవ్వూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేసిందో తెలియజేస్తామని వివరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Latest news