చంద్రబాబు పాలనంతా మద్యం మీద ఆదాయం పొందాలనే : అంబటి రాంబాబు

-

వంద రోజుల చంద్రబాబు పాలనలో ఆరుసార్లు క్యాబినెట్ సమావేశమైనా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. పన్నులు వేయటం, జనాన్ని పీక్కుతినటం తప్ప మరేమీ లేదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వచ్చారు, పన్నులు పెంచారు. చంద్రబాబు వచ్చారు జనాన్ని వరదల్లో ముంచారు. పరిస్థితులు ఇలా ఉంటే మాది‌ మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. అమ్మకు వందనం పేరుతో మహిళలను మోసం చేసినందుకా మీది మంచి‌ ప్రభుత్వమా.. వాలంటీర్లను నిలువునా మోసం చేసిన మీది మంచి ప్రభుత్వామా.. వరదల్లో జనాన్ని ముంచినందుకు‌ మంచి ప్రభుత్వమా.. లిక్కర్ తో జనాన్ని తాగించబోతున్నందుకు మంచి ప్రభుత్వమా అని ప్రశ్నించారు.

జనమంతా మీది ముంచే ప్రభుత్వం అంటుంటే చంద్రబాబు మాత్రం డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇసుక దోపిడీ చేస్తున్నందుకు మీది మంచి ప్రభుత్వమా.. నాణ్యమైన మంచి మద్యం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మద్యం తాగటం ప్రమాదకరం అనే మాట ఇక తీసెయ్యండి. నాణ్యమైన మద్యం తాగటం మంచిది అని పెట్టండి. మా రాజకీయాల కొత్తలో నారావారి సారా పాలన డౌన్ డౌన్ అని నినాదాలు చేసేవాళ్లం. చంద్రబాబు పాలనంతా మద్యం మీద ఆదాయం పొందాలనే. ఈ మద్యం పాలసీ వెనుక పెద్దస్కాం ఉంది. మా హయాంలో మద్యం తాగటం వలన జనం చచ్చిపోతున్నారని ప్రచారం చేశారు. మరి ఈ వంద రోజులుగా మా హయాంలోని బ్రాండ్లే ఉన్నాయి కదా.. మరి ఇప్పుడు జనం చనిపోలేదేం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news