అంబటి రాయుడు భార్య, పిల్లలకు బెదిరింపులు !

-

అంబటి రాయుడు భార్య, పిల్లలకు హత్యాచార బెదిరింపులు వచ్చాయి. కొంత మంది RCB ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. విరాట్ కోహ్లీని విమర్శించినందుకు అంబటి రాయుడు కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘ IPL ను గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని’ రాయుడు పరోక్షంగా కోహ్లీపై వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అంబటి రాయుడు స్నేహితుడు సామ్‌పాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నాడు.

Ambati Rayudu’s wife and children face death threats from Virat Kohli fans

కాగా నాలుగు రోజుల కిందట ఆర్సీబీ ఇజ్జత్ తీశాడు అంబటి రాయుడు.. సంబరాలతో కప్పు గెలవలేరన్నాడు. ప్లేఆఫ్స్ లో రాజస్థాన్ పై ఓటమి అనంతరం ఆర్సిబికి సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. “ఫ్యాషన్, సెలబ్రేషన్స్ తో ట్రోఫీలు రావు. ప్లేఆప్స్ కు చేరితేనే టైటిల్లు వస్తాయనుకోవడం పొరపాటే అవుతుంది. టోర్నీలో అన్ని మ్యాచ్లు బాగా ఆడితేనే టైటిల్ కొడతారు. చెన్నైపై గెలిస్తేనే ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తామనే భ్రమలో ఉండొద్దు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈతరుణం లోనే.. అంబటి రాయుడు భార్య, పిల్లలకు హత్యాచార బెదిరింపులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news