ఏపీలో కరోనా టెర్రర్.. కొత్తగా ఎన్ని కేసులంటే..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,92,760కు పెరిగింది.

ap-corona

ఒక్కరోజు వ్యవధిలో మరో 64 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,105కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90,279 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. నేడు కొత్తగా 10,845 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 4,97,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు.