ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. ఇంటర్మీడియట్ లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయడానికి… కసరత్తులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్. ఈ సీబీఎస్ఈ సిలబస్ కారణంగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో సిలబస్ తగ్గనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అంతేకాదు మ్యాథ్స్ లో ప్రస్తుతం ఉన్న రెండు పేపర్లను ఒకటిగా రాయాలా లేక అలాగే కొనసాగించాలా అనే అంశాల పైన కూడా… ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కసరత్తులు చేస్తోంది. అటు ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ , అడ్వాన్స్ అలాగే నీట్ కోచింగ్ ఇప్పించాలని కూడా విద్యాశాఖ అడుగులు వేస్తోంది.