టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నూతనంగా పార్టీ కార్యాచరణ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.నేటి నుంచి జిల్లాల వారీగా గాంధీభవన్‌లో సమీక్షలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు కరీంనగర్, 4 నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లాలపై సమీక్ష జరపనున్నారు.
ఇందులో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్, సంయుక్త కార్యదర్శి పీసీ విష్ణునాథ్తో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన ఎమ్మెల్యే, పార్లమెంట్ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఫ్రంటల్ చైర్మన్లు, ముఖ్య నేతలు సైతం పాల్గొననున్నారు. మరోవైపు మంత్రులు గాంధీ భవన్‌కు వచ్చే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇకపై ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒకరు లేదా ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో ప్రజల సమస్యలు వినేందుకు అందుబాటులో ఉండనున్నారు.