చంద్రబాబు, లోకేష్ లకు చీరలు కట్టించాలన్న మంత్రి రోజా వ్యాఖ్యలకు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత కౌంటర్ ఇచ్చారు.అభం శుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నారని… తాడేపల్లి కొంప దాటి బయటకు రాలేని నాయకుడు జగన్ అనిఫైర్‌అయ్యారు. మహిళా సాధికారత గురించి మీరు మాట్లాడటం సిగ్గుచేటమ్మా.. రోజమ్మా..! ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి, నాగమ్మ, ఈరోజు తెనాలిలో బలైన వివాహితలు బలవ్వడానికి సీఎం జగన్ కారణం కాదా? అని మండిపడ్డారు.
లోకేశ్ గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటున్నారని… జగనులా ఇల్లు దాటి బయటకు రాకుండా, పోలీస్ పహారా లేకుండా బయటకు రాలేని దుస్థితిలో లేరని ఆగ్రహించారు. లోకేశ్ ఓడిపోయాడంటున్న రోజా ఓడిపోలేదా? తల్లిని విశాఖపట్నంలో గెలిపించుకోలేని జగన్ ఏ రంగు చీర కట్టుకోవాలో చెప్పమ్మా.. రోజమ్మా.. అంటూ చురకలు అంటించారు. మహిళా సాధికారతంటే కచ్చా బాదాం డాన్స్ చేస్తూ, జబర్తస్ట్ షోలో పడి పడి నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదన్నారు. మేం ఊరికో ఉన్మాది అంటే ఉలిక్కిపడుతున్నారెందుకు..? అని నిలదీశారు.
టీడీపీ పుస్తకం విడుదల చేశాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. ఊరికో ఉన్మాది ఉన్నాడని టీడీపీ నిరూపిస్తుంది అందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గుంటూరులో బాలికను నిర్బంధించి రోజుల తరబడి అత్యాచారం చేసింది వైసీపీ ఉన్మాదులు కారా..మంత్రి పదవిలో ఉండి.. ఏం మాట్లాడుతున్నారో రోజా తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. బూతులతో చంద్రబాబు, లోకేశ్ లతో పాటు, మాపార్టీవారిని దూషిస్తున్నది వైసీపీ పేటీఎం కుక్కలు కారా? వైసీపీ వారందరికీ ఎన్ని చీరలు కావాలో చెప్పండి.. పంపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.