మేక చీజ్ తో బరువు ఈజీగా తగ్గొచ్చు.. గుండె ఆరోగ్యానికి కూడా మంచిదట..!

-

చీజ్ అంటే.. ఆవు పాలతో, గేదె పాలతో చేసేవి ఎక్కువ మందికి తెలుసు. ఆవు జున్ను చాలా మంచిదిని.. సంవత్సరానికి ఒక్కసారి తిన్నా చాలు అంటుంటారు. ఎందుకు.. అందులో విటమిన్ డీ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నా.. సరిపడా విటమిన్ డీ అందుతుంది కాబట్టి. అయితే మేకపాల నుంచి కూడా చీజ్ తయారు చేస్తారు. మరి ఇది ఆరోగ్యానికి మంచిదేనా.? తింటే ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో లేదా చూద్దామా..!
మేక చీజ్ లో… ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్లు ,విటమిన్ ఎ, విటమిన్ బి 2, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, రాగి, జింక్ , సెలీనియం వంటి పోషకాలు ఉన్నాయి. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ను గలిగి ఉండటంతోపాటు ఇది సులభంగా జీర్ణమవుతుంది. మేక చీజ్ లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు రోజూ 60 గ్రా మేక చీజ్‌ను 12 వారాలపాటు తీసుకుంటే హెచ్‌డిఎల్( గుడ్) కొలెస్ట్రాల్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు.

బరువు తగ్గేందుకు కూడా..

మేక పాలతో తయారైన చీజ్ ను ఆహారంగా తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చట..దీనిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు. మేక చీజ్ బరువు తగ్గించటంలో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.. మేక చీజ్ లో కాల్షియం, భాస్వరం, రాగి వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించటానికి ఇవి దోహదపడతాయి. మేక చీజ్‌లో క్యాప్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మంపై మొటిమలకు కారణమయ్యే పి ఆక్నెస్ అనే బ్యాక్టీరియాతో పోరాడటానికి క్యాప్రిక్ ఆమ్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కొందరు ఆవు పాలతో తయారైన చీజ్ ను జీర్ణించుకోలేరు. అలాంటి వారు మేకపాలతో తయారైన చీజ్ ను తీసుకోవటం మంచిది. ఇందులో లాక్టోస్ సహజంగానే తక్కువ ఉంటుంది. దీని వల్ల జీర్ణ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేక చీజ్ లో ఉండే ప్రొబయాటిక్స్ గట్  బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి.. దొరికితే మేక చీజ్ ను కూడా ట్రై చేయండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news