వరద సాయంపై చర్చించడానికి మేం సిద్దం.. వైసీపీ సిద్ధమా..? – అనిత

-

వరద సాయంపై చర్చకు రావాలని హోం మంత్రి అనిత సవాల్ విసిరారు. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్దం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అంటూ రెచ్చిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ. 92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశామని తెలిపారు. వరద సాయం కింద ఎన్టీఆర్ జిల్లాకు విడుదల చేసిందే రూ. 139 కోట్లు అన్నారు. అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారు..? అని ప్రశ్నించారు. వరద సాయం అందించడమే కాకుండా.. బుడమేరు గండ్లను పూడ్చేలా మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారని వెల్లడించారు.

anitha on flood scam

కలెక్టరేట్లో మకాం వేసి రాష్ట్రంలో ఉన్న వరద ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించి…. వార్డులకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారన్నారు.ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరైనా ఉంటారా..? అని నిలదీశారు. ఖాజానా ఖాళీ చేసేసి.. అవినీతి ఖాజానా అంటారా..? అని మండిపడ్డారు. ఖాజానాలో సొమ్ముని తన జమానాలోనే జగన్ జమ చేసేసుకున్నారు…. ఎగ్ పఫ్ లకు జగన్ హయాంలో ఖర్చు పెట్టినట్టు కాదన్నారు. మా ప్రభుత్వంలో ప్రజల కోసమే ఖర్చు పెడతామని… గ్యాస్ స్టవ్వులు కూడా బాగు చేయించిన సీఎం ఎవరైనా ఉంటారా..? అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news