ఎంపీ మాధవ్ ను వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? – అనిత

-

ఎంపీ మాధవ్ ను వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? అని ఫైర్ అయ్యారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. రాజకీయ కుట్ర అని హోం మంత్రి ఎలా చెబుతారు..? వెకిలి వేషాలేస్తోన్న ఎంపీపై చర్యలు తీసుకోకుండా ఎంపీని వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? అని నిప్పులు చెరిగారు. హోం మంత్రిగా ఎలా పని చేయాలో తెలియకుంటే ఇంట్లో కూర్చొవాలని చురకలు అంటించారు.

ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత హోం మంత్రి బయటకొచ్చి కుట్ర అని మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే.. అందుబాటులో ఎవ్వరూ లేరన్నారు. పబ్లిక్ హాలిడే కాబట్టి.. పోలీసు ఉన్నతాధికారులు శెలవులో ఉన్నారట అని మండిపడ్డారు.

24 గంటలు పని చేయాల్సిన పోలీసు శాఖ శెలవు తీసుకుంది.రేప్ చేసినా రేపు రండి అనే పరిస్థితి ఏపీ పోలీస్ శాఖలో కన్పిస్తోందన్నారు. అంబటి, అవంతి లాంటి వాళ్లపై చర్యలు తీసుకుని ఉంటే మాధవ్ న్యూడ్ ఎపిసోడుపై ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news