మరో 10 రోజుల్లో చంద్రబాబుపై 5 కేసులు నమోదు !

-

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై 12 అక్రమ కేసులను నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నట్లుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిపై ఐదు కేసులు నమోదు చేశారని, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నీరు – చెట్టు అనే పథకంలో అవకతవకలు జరిగాయని ఆరవ కేసు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారన్నారు. అయితే ఫిర్యాదుదారుడు కోసం ప్రభుత్వ పెద్దలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

ఫిర్యాదుదారుడి పేరు చివర రెండక్షరాలు ఉంటాయో, లేకపోతే ఈసారి చౌదరి, యాదవ, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారితో ఏమైనా ఫిర్యాదు చేయిస్తారేమో చూడాలని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ 11 చార్జి షీట్లు దాఖలు చేయగా, చంద్రబాబు నాయుడు గారిపై సీఐడీ ద్వారా అంతకంటే ఒక కేసు ఎక్కువగానే నమోదు చేయించాలని పథక రచన చేస్తున్నారన్నారు. రానున్న పది రోజుల వ్యవధిలో ఇంకొక ఐదు కేసులు చంద్రబాబు నాయుడు గారిపై నమోదు చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ రెడీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా, ఫిర్యాదుదారులకు ఇది ఒక చక్కటి అవకాశం అంటూ అపహాస్యం చేశారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు ఎవరన్నది త్వరలోనే తెలుస్తుందని, ఇప్పటికే ఫిర్యాదు చేసిన వారంతా ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news