చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు.. రేషన్ పంపిణీ వాహనాలకు ఇక సెలవు. రేషన్ వాహనాలను నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి స్వస్తి పలికింది. మళ్ళీ పాత రేషన్ షాపుల విధానాన్ని ప్రారంభించనుంది. ఈమేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు.
గిరిజన ప్రాంతాల్లో ఉన్న 962 రేషన్ వాహనాలను నిలిపివేస్తూ, పాత రేషన్ షాపుల పద్దతిని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు సంధ్యారాణి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో పథకానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చింది. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’గా ఉన్న పథకం పేరును ‘అన్నదాత సుఖీభవ’గా మార్పు చేసింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్‌లో మార్పులు చేస్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఫొటోలను ఉంచింది. కాగా, ఇప్పటికే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ కల్యాణమస్తు పేర్లను మార్చేసిన విషయం తెలిసిందే.