ఏపీ మంత్రి రోజాకు మరో కీలక పదవి

ఏపీ మంత్రి రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా తార నుంచి రాజకీయాల వరకు ఆమె ఎదిగారు. అయితే, తాజాగా, ఏపీ మంత్రి రోజాకు మరో పదవి దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రోజాకు అవకాశం లభించింది. శాయ్ పాలకవర్గ సభ్యురాలిగా మంత్రి ఆర్కే రోజా నియమితులయ్యారు.

2018 అక్టోబర్ లో నియమించిన ఈ పాలకవర్గం 2022 అక్టోబర్ వరకు అమలులో ఉంది. కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖామంత్రి అధ్యక్షుడిగా కొనసాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో సభ్యులుగా, పాలకవర్గ పునర్నియామకంలో భాగంగా సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల క్రీడల శాఖ మంత్రులకు చోటు దక్కింది. రొటేషన్ పద్ధతిలో వివిధ రాష్ట్రాల మంత్రులను పాలకవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు శాయ్ పేర్కొంది. ఐదు రాష్ట్రాల క్రీడాశాఖ మంత్రులకు అవకాశం లభించగా, మంత్రి రోజాకు పదవి ఇచ్చారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?