తిరుప‌తిలో మ‌రో రియ‌ల్ హీరో.. రైలు కింద ప‌డ‌బోయిన మ‌హిల‌ను కాపాడిన కానిస్టేబుల్‌!

ముంబ‌యిలో ఓ పిల్లాడు ప‌ట్టాల‌పై ప‌డిపోతే.. ట్రైన్ వ‌చ్చేలోపే ఆ పిల్లాడిని ప్లాట్ ఫామ్ పైకి ఎక్కించి ప్రాణాలు కాపాడిన వ్య‌క్తి గుర్తున్నాడు క‌దా. హా ఇప్పుడు తిరుప‌తిలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. కింద ప‌డిపోతున్న మ‌హిళ‌ను కాపాడి.. శ‌భాష్ అనిపించుకున్నాడు ఓ కానిస్టేబుల్‌.

ఓ మ‌హిళ రైలెక్కి తిరుప‌తికి వ‌చ్చింది. అయితే ఆమె ప‌డుకోవ‌డంతో.. తిరుప‌తిలో ఉద‌యం 4.30గంట‌ల‌కుట్రైన్ ఆగిన‌ప్పుడు దిగ‌లేక‌పోయింది. కాగా ట్రైన్ క‌దులుతుండ‌గా.. ఆమెకు మెల‌కువ వ‌చ్చింది. దీంతో కంగారు ప‌డిపోయి.. హ‌డావిడాగా లేచి డోర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అప్ప‌టికే ట్రైన్ కాస్త స్పీడందుకుంది.

అయినా ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ప‌క్క‌నే ఉన్న ప్లాట్ ఫామ్‌పై ప‌డిపోయింది. దీంతో అదుపుత‌ప్పి రైలు కింద ప‌డ‌బోయింది. ఇది గ‌మ‌నించిన ప‌క్క‌నే ఉన్న కానిస్టేబుల్‌.. క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా ప్రాణాల‌కు తెగించి ఆమెను కాపాడాడు. ట్రైన్ కింద ప‌డిపోబోతున్న ఆమెను ప‌ట్టుకుని ప‌క్క‌కు లాగాడు. ఏమాత్రం తేడా వ‌చ్చినా.. ఇద్ద‌రూ ట్రైన్ కింద ప‌డేవారే. అయితే ధైర్యంగా ఆమెను కాపాడిన ఆ కానిస్టేబుల్ ను అంతా అభినందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీలు సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతున్నాయి.