వాహనాలు ఎందుకు సీజ్ చేయట్లేదు…?: హైకోర్ట్

-

కోవిడ్ నిభందనలు ఉల్లంఘిస్తున్న వారి వాహనాలు ఎందుకు సీజ్ చేయడం లేదని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర పోలీసులపై మండిపడింది. బ్లాక్ మార్కెట్ పై పోలీసులు దృష్టి పెడుతున్నారా అంటూ కరోనా చర్యలపై విచారణ ఈ సందర్భంగా పోలీసులకు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రతి కమిషనరేట్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బ్లాక్ మార్కెట్ పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ వివరించారు.

ఇప్పటి వరకు 39 కేసులు నమోదు చేశామని డీజీపీ వివరించారు. హాస్పిటల్ సిబ్బందే ఈ బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతున్నారని డీజీపీ తెలిపారు. 94 శాతం పోలీసులు వాక్సిన్ వెయించుకునారనీ తెలిపారు. వారి కుటుంబాలకు సైతం వాక్సిన్ వేయిస్తున్నామన్నారు. కోవిడ్ నిభందనలు ఉల్లంఘించిన వారి పై 244170 కేసులు నమోదు చేశామని పబ్లిక్ గ్యాదరింగ్స్ లో దాన్ని నిర్వాహకులు పై కేసులు నమోదు చేస్తున్నామనీ  తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news