జగన్ పై సినిమా తీయాల్సి వస్తే ‘అవినీతి రత్న’ అని పెట్టి తీస్తే బాగుంటుందని చురకలు అంటించారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. జగన్ పేదల పెన్నిధి అని సిగ్గు, ఎగ్గు లేకుండా ప్రెస్ మీట్ లు పెట్టి వైసీపీ మంత్రులు చెప్పడం అవివేకం అన్నారు. వైసీపీ మంత్రులు చెప్పినట్లు జగన్ పేదల పెన్నిధి కాదు పేదల ద్రోహి అని.. జగన్ కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని ఆగ్రహించారు.
జగన్ పేదల ద్రోహి అని స్వయంగా ప్రజలే అంటున్నారు… చంద్రన్న అన్నా క్యాంటిన్లను పెడితే జగన్ వాటిరని రద్దు చేశారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. సంక్షేమాన్ని రద్దు చేసినవారు పేదల పెన్నిధి ఎలా అవుతారు? సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేసినవారు పేదల పెన్నిధి ఎలా అవుతారు? అని నిలదీశారు. చంద్రన్న చరిత్రలో తొలిసారిగా మత్స్యకారులకు, చేనేతలకు, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారు…చంద్రన్న హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి తన ధాతృత్వాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు.ఏ ఇతర పథకం వస్తున్నా.. వృద్ధాప్య పెన్షన్ రద్దయ్యే విధంగా జగన్ ప్రభుత్వం చేసిందని ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.