మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం.

మార్చి మూడు, నాలుగు తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ తర్వాతే బడ్జెట్ సమావేశాలను చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మార్చి సెకండ్ వీక్ లో ప్రారంభించి నెలాఖరు వరకు కొనసాగిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?