కొత్త ఎక్సైజ్ పాలసీ కి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!

-

ఆంధ్రప్రదేవ్ క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎక్సైజ్ అవకతవకలపై క్యాబినెట్ భేటీలో చర్చ కొనసాగింది. 2014-19, 2019-24 మధ్య తీసుకొచ్చిన ఎక్సైజ్ అవకతవకలపై సైతం క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం దోపిడీ చేయడం కోసమే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్లు కేబినెట్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు సైతం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కెబినెట్ సూచించింది.

AP Cabinet took important decisions

స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఈ నిబంధనను తప్పిస్తామని గత ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో రద్దు చేసిన కెబినెట్. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news