చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతకు జీవం పోయాలి అన్నారు దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అన్నారు. ప్రధానంగా ఏపీలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలు అని తెలిపారు.
చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధునాతన రాట్నాలు, మగ్గాలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అందించారని తెలిపారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తోందన్నారు.