ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవ్వాళ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం సి ఆర్ డి ఏ కమిషనర్ నిధుల సమీకరణ పై ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ చర్చ ఉంటుంది. నిధుల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఏపీ కేబినెట్.

అదే సమయంలో… రాజధాని ఫేజ్ 3 నిర్మాణం కోసం భూసేకరణ పై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా చర్చించనున్నారు. ఉచిత బస్సు ఎప్పుడు పెట్టాలి..? దానికి ఎన్ని నిధులు అవసరం అవుతాయి అనే దాని పైన కూడా కీలక చర్చ జరగనుంది.