BREAKING : ప్రారంభమైన ఏపీ కేబినేట్… 49 అంశాలపై చర్చ

-

సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం అయింది.ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు..రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులపై ఇవాళ కేబినెట్ లో చర్చించి ఆమోదించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

CM Jagan's visit to Nandyala and Kurnool districts on 19th of this month
AP Cabinet started

ముఖ్యంగా 49 అంశాల పై చర్చించనున్న ఏపీ కేబినెట్…. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇవాళ ఈ పథకానికి ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరనుంది. UPSC లో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం చేనుంది.

అలాగే.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్ష పై చర్చించనుంది ఏపీ కేబినెట్. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన పై చర్చ నిర్వహించనుంది ఏపీ కేబినెట్.

Read more RELATED
Recommended to you

Latest news