నేడు చంద్రబాబు చేయనున్న 5 సంతకాలు వీటిపైనే

-

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం ఆయన చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం ఛాంబర్‌లో గురువారం సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఈ సంతకాలు చేస్తారు.

అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డీఎస్సీ దస్త్రంపై పెట్టనున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం పెట్టనున్నారు. పింఛన్ పెంపు, సవరణ దస్త్రంపై మూడో సంతకం.. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై నాలుగో సంతకం చేయనున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ నైపుణ్య గణనపై  చంద్రబాబు ఐదో సంతకం పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news