సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం.. కొత్త పోస్టుల‌కు శ్రీకారం..

-

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ప‌లు సంస్క ‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన ఆయ‌న తాజాగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ను మ‌రింత చేరువ చేసేందుకుగాను మ‌రో ముంద‌డుగు వేశారు. ఈ క్ర‌మంలోనే పంచాయతీరాజ్ (పీఆర్‌), గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించి డివిజన్‌ స్థాయిలో కొత్తగా డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్ ‌(డీఎల్‌డీవో) పోస్టును సృష్టించారు. ఈ మేర‌కు ప్రతి రెవెన్యూ డివిజన్ ‌కు ఒక డీఎల్‌డీవోను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్‌ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమన్వయం చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షించే బాధ్యత డీఎల్‌డీవోలకు అప్పగించ‌నున్నారు.

ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఎంపీడీవోగా కనీసం ఐదేళ్లపాటు సర్వీసు పూర్తిచేసిన వారికి డీఎల్‌డీవోగా పదోన్నతి కల్పించనున్నారు. ఈ పోస్టుకు డిప్యూటీ డైరెక్టర్‌ హోదా కల్పిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రస్తుతం మండలస్థాయిలో ఎంపీడీవో, జిల్లాస్థాయిలో జేసీ పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇంత పెద్ద వ్యవస్థలో వేల మంది సిబ్బందిని పర్యవేక్షించడం వారికి ఇబ్బందిగా మారింది. దీనిని గుర్తించిన ప్ర‌భుత్వం మధ్యస్థాయిలో ఒక అధికారి ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో డీఎల్‌డీవో పోస్టును తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 51 మంది ఎంపీడీవోలకు పదోన్నతి కల్పిస్తూ వారిని డీఎల్‌డీవోలు నియమించేందుకు సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news