ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మరో సారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గానికి జరగనున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నట్టు ఆయన నిన్న ప్రకటించారు. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి 2007, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు నాగేశ్వర్. 2014 వరకు మండలికి ప్రాతినిధ్యం వహించారు. తనకు ఇప్పటికే అనేక సంఘాలు మద్దతు ప్రకటించాయని నాగేశ్వర్ తెలిపారు.
నిజానికి టీఆర్ఎస్ తరపున ఈయన్ని పోటీ చేయించాలని కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. అయితే కేసీఆర్ కోరికను నాగేశ్వర్ సున్నితంగా తిరస్కరించారు. అయితే ఈయనకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోందాని కూడా అన్నారు. ఈ విషయం మీద క్లారిటీ రావలసి ఉంది.
ఇక మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ తేదీలను అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.