ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) ప్రిలిమినరీ కీ వచ్చేసింది

-

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు అలర్ట్. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలైంది. గురువారం రోజున అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ కీ విడుదల చేసిన అధికారులు.. ఈరోజు (మే 24వ తేదీ) ఉదయం ఇంజినీరింగ్ స్ట్రీమ్ కీని అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షల ప్రాథమిక కీతో పాటు మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, రెస్పాన్స్‌ షీట్లు వెబ్ సైటులో పెట్టినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది.

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అభ్యర్థులు ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల్లోపు, ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు 26వ తేదీన ఉదయం 10 గంటల లోపు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ, 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,39,139 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news