BREAKING : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి !

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్ర రెడ్డి విడుదల చేశారు. ఈ ఈసెట్ లో 92.36శాతం ఉత్తీర్ణత సాధించగా అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 91.44 సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 95.68 సాధించారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారికి బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి జేఎన్టీయూ ఆధ్వర్యంలో జులై 22న ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహణ జరిగింది.

ఈ ఈసెట్ పరీక్షకు 36,440 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 14 విభాగాల్లో జరగాల్సిన పరీక్షకు 11 విభాగాల్లో మాత్రమే నిర్వహించామని.. కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్లకంటే దరఖాస్తులు తక్కువ గా రావడంతో పరీక్ష నిర్వహించ లేదని ఈ సందర్భంగా  హేమ చంద్రారెడ్డి పేర్కొన్నారు.  సిరామిక్ ఇంజనీరింగ్, బీఎస్సీ గణితంకి తక్కువ దరఖాస్తులు రాగా, బయోటెక్ కు ఎవ్వరు దరఖాస్తు చేయలేదని.. బీఎస్సీ గణితం, సిరామిక్ టెక్నాలజీకి చేసుకున్న వారంతా ఈసెట్ లో ఉత్తీర్ణత సాధించినట్లననని స్పష్టం చేశారు. సీట్ల భర్తీ ఎలా అనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు… విద్యార్థులు తొందరపడి కాలేజీలకు డబ్బులు కట్టవద్దని కోరారు హేమ చంద్రారెడ్డి.