వారికి ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశం..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం విధితమే. ఈ వర్షాల కారణంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విజయవాడ వాసుల బాధలు అయితే వర్ణణాతీతం. బుడమేరు కి గండ్లు పడటంతో పరిస్థితి దారుణంగా మారింది. ముంపు ప్రాంతాలను కొద్ది రోజుల పాటు మరో చోటుకి తరలించారు. వారికి ప్రభుత్వం ఆసరాగా నిలిచి మంచినీరు, ఆహారం అందించింది.

అయితే ఈ వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లను కోల్పోయిన వారికి ఉచితంగా సర్టిఫికెట్లు, రిజిస్టర్ డాక్యుమెంట్స్, ఆధార్, బర్త్, డెత్, మ్యారేజ్ వంటి సర్టిఫికెట్లు, పోగొట్టుకున్నా నాశనం అయినా వారందరికీ డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది. సీఎం చంద్రబాబు అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు సర్టిఫికేట్లను ఎలా జారీ చేయాలి..? ఏ ప్రాతిపదికన జారీ చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news