జగన్ ఫుల్ హ్యాపీ… కల నెరవేరింది!

-

ఉద్దేశ్యం మంచిదైతే… ఆరంభంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఆశయం నెరవేరుతుంది! ఈ విషయం తాజాగా మరోసారి జగన్ విషయంలో రుజువైంది! అవును… తాజాగా ఏపీ సర్కార్ జీవో నెంబరు 24 ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం… రాబోయే 2020-21 విద్యా సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెడుతున్నట్టు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది!

ముందుగా ఈ విషయంపై జగన్ సర్కార్ ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులే చెప్పించాలని ఫిక్సయిపోయింది. అయితే హైకోర్టు సూచనల మేరకు తల్లితండ్రుల ఇష్టానుసారంగానే, తల్లితండ్రుల అభిప్రాయాలకు అనుగుణంగానే పిల్లలు ఏ మీడియంలో చదవాలనేది నిర్ణయించబడాలని తేలింది! ఈ విషయంపై కొన్ని పక్షాలు ఎగిరి గంతేశాయి.. జగన్ కల నెరవేరలేదని రాక్షసానందం పొందాయి!! అయినా జగన్ వెనక్కి తగ్గలేదు… ఈ వ్యవహారంపై తల్లి తండ్రుల అభిప్రాయాలు వెంటనే తెలుసుకోవాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్.సీ.ఈ.ఆర్.టీ)కి బాధ్యతలు అప్పగించి ఒక సర్వే చేయించింది.

ఈ సర్వేలో తల్లి తండ్రులు మొత్తంగా 96.17 మంది తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలని స్పష్టం చేశారు! ఇక తెలుగు మీడియంలోనే బోధన కావాలని 3.05శాతం మాత్రమే తల్లిదండ్రులు కోరుకోగా.. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం గా ఉన్నారు! దీంతో ఈ నివేదికను సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవుడ్ పిటీషన్ దాఖలు చేసింది. అనంతరం ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తల్లితండ్రుల మద్దతుతో జగన్ కల నెరవేరినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా… ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news