ఎన్నికల హింసపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

-

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అనంతరం హింసపై సిట్ వేయనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేయనుంది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, , చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనుంది సిట్. తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది ఏపీ సర్కార్‌.

ఎన్నికల హింసపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. ప్రతి ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న పోలీసులు….రెండు రోజుల్లో నివేదికను ఈసీకి సమర్పించనున్నారు. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే వేటు వేసింది ఈసీ. ఇక అటు జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది ఇంటెలిజెన్స్‌. జూన్‌ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని వార్నింగ్‌ ఇచ్చింది ఇంటెలిజెన్స్‌.

Read more RELATED
Recommended to you

Latest news