ఎస్పీ అమిత్ సమక్షంలోనే కేతిరెడ్డి ఇంట్లో దాడులు జరిగినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. తాడిపత్రిలో జరిగిన అలర్లప్తె వైసీపీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… తాడిపత్రి లో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నామన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆగ్రహించారు.
ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. పోలీసుల సహకారంతోనే తాడిపత్రి లో వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు జరిగాయి…ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషం అంటూ ఆగ్రహించారు. ఏఎస్పీ రామకృష్ణని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ…టీడీపీ – జనసేన – బీజేపీ లకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్య గా భావిస్తున్నామని మండిపడ్డారు.