గ్యాస్ వినియోగదారులకి ఏపీ సర్కార్ షాక్

-

ఏపీ ప్రభుత్వం వంట గ్యాస్ పై వ్యాట్ పెంచింది. 14.5 శాతంగా ఉన్న గ్యాస్ ధరను పది శాతం మేర పెంచింది. దీంతో వ్యాట్ 24.5 శాతానికి పెరిగింది. కరోనా దెబ్బతో ఆర్ధికంగా కుదేలైన ఆర్ధిక పరిస్ధితుల నుంచి గట్టెక్కేందుకు అన్ని మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుకోసం నిధుల వేట సాగిస్తోంది.

ఇందులో భాగంగా వంట గ్యాస్ పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ పథకాల నిధుల కోసం వంట గ్యాస్ పై వ్యాట్ పెంచుతున్నట్టు చెప్పింది ప్రభుత్వం. ప్రభుత్వ అంచనాల్లో 29.5శాతం మాత్రమే ఆదాయం వస్తోందని, రాష్ట్ర రెవెన్యూలు కూడా భారీగా పడిపోయాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news