తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లను సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అయింది. అయితే గత రెండు రోజుల నుంచి తెలంగాణ సీఎల్పీ నేత ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాజీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, థాక్రె, డీ.కే.శివకుమార్, కేసీ వేణుగోపాల్ వంటి అధినాయకులను కలిసారు. పలు విషయాల గురించి చర్చించారు. చివరగా కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డినే తెలంగాణ ముఖ్యమంత్రి అని ప్రకటించారు.
ఎప్పుడైతే కేసీ వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రకటించారో అప్పటి నుంచే పలువురు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావన తొలి నుంచి సీఎంగా ఎదిగిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నా అన్నకు అభినందను.. మీరు కచ్చితంగా దేశంలోని పవర్ పుల్ సీఎంలలో ఒకరిగా మారుతారని పేర్కొన్నారు. ఫ్యామిలీతో కలిసి రేవంత్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది సీతక్క.