ఏపీలో పరిశ్రమల అభివృద్దికి మరో కీలక ముందడుగు

-

ఏపీలోని అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధి తమ లక్ష్యం అని చెబుతోన్న ఏపీ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన మీద కాన్సంట్రేట్ చేస్తోంది. అందులో భాగంగానే ఆంద్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ బోర్డు, ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ గా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉండనున్నారు.

అలానే పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన 11 మంది ముఖ్యకార్యదర్శులను, ఉన్నతాధికారులను సభ్యులుగా పేర్కోంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య ఛైర్మన్ గా రోజా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news