ఆ ఉద్యోగులకు ప్రస్తుత బదిలీలు నుండి మినహయింపు ఇవ్వాలి..!

-

ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల ఉత్తర్వుల మార్గదర్శకాలలో మార్పులు కోరింది ఏపీజెఏసీ అమరావతి. సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీలు నుండి మినహయింపు ఇవ్వాలి అని పేర్కొంది. 62 సంవత్సరాల వయసులో అనేక శారీరక జబ్బులతో ఉంటారు. అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.

అలాగే వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకుని పెన్షన్ కొరకు పంపాల్సిన అవసరం ఉంటుంది. గతంలో 2016వ సంవత్సరంలో నాటి ప్రభుత్వం కూడా సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇచ్చింది అని పేర్కొన్నారు. అయితే ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని, సీఎంఓ అధికారుల్ని సచివాలయంలో కలిసి వ్రాత పూర్వకంగా విజ్ఞప్తి చేసాం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, సీఎంఓ అధికారులు చాలా సానుకూలంగా స్పందించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అని ఏపీజెఏసీ అమరావతి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news