ఏపీలో మద్యం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ ధరలను మార్చింది ఏపీ ప్రభుత్వం. 150 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న మద్యం ధరలు తగ్గించారు. కానీ 190 నుంచి 600 రూపాయల దాకా ఉన్న మద్యం ధరలు పెంచారు.
అంతే కాక బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలను కూడా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఇక ఇప్పటికే హైకోర్టు మందుబాబులకి శుభవార్త చెప్పింది. పక్క రాష్ట్రాల నుండి మూడు మందు బాటిల్స్ రాష్ట్రంలోకి తెచ్చుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మందు బాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వలెనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పచ్చు. ఎందుకంటే మందు బాబులు బోర్డర్ కు వెళ్లి మరీ మందు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. అలా అయితే మందు అంతా పక్క రాష్ట్రాలకి వెళ్లి పోతుంది, దానిని దృష్టిలో పెట్టుకుని ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.