అల్లు అర్జున్ కి ఏపీ మంత్రి అభినందనలు

-

69వ జాతీయ సినిమా అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని వరించింది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటనకు ఈ గుర్తింపు లభించింది. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అల్లు అర్జున్ కి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా చరిష్మాను జాతీయస్థాయిలో నిలబెట్టిన ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అల్లు అర్జున్ కి, అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ పాపులర్ చిత్రంగా నిలవడంతో తెలుగు సినిమా అభిమానులుగా ఎంతో గర్విస్తున్నామని తెలిపారు. అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news