మోదీ-జిన్‌పింగ్‌ ముచ్చటపై చైనా రాజకీయం.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

-

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కొంతసేపు మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య నిర్మాణాత్మక ద్వైపాక్షిక సమావేశం జరగలేదని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అయితే తాజాగా.. చర్చల విషయంలో భారత్‌పై చైనా నోరుపారేసుకుంది. దిల్లీ అభ్యర్థన మేరకే బ్రిక్స్‌ సదస్సులో మోదీ-జిన్‌పింగ్‌ సంభాషించుకున్నట్లు ఆరోపించింది.

చైనా వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం చైనానే కోరిందని.. ఆ అభ్యర్థన పెండింగ్‌లో ఉందని స్పష్టం చేసింది. అయితే బ్రిక్స్‌ దేశాల అధినేతల సంయుక్త మీడియా సమావేశం అనంతరం మోదీ, జిన్‌పింగ్‌ అనధికారికంగా మాట్లాడుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

అయితే ఈ అనధికారిక సంభాషణలోనూ ప్రధాని మోదీ తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ-LAC వెంబడి “పరిష్కారం కాని” సమస్యలపై భారత్ ఆందోళనలను జిన్‌పింగ్‌కు తెలియజేసినట్లు తెలిసింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం అవసరమని జిన్‌పింగ్‌తో మోదీ పేర్కొన్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news