ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం..!

-

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అవ్వనుంది. అయితే ఈ ఎన్నికల నుండి ఇప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ తప్పనుకుంది. సరైన బలం లేకవడంతోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు వైసీపీ నుండి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా.. ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థి గా షేక్ షఫీ నామినేషన్ వేశారు. దాంతో ఎన్నిక అనివార్యం అయ్యింది.

కానీ పోటీలో టీడీపీ లేకపోవడంతో బొత్స సత్యనారాయణ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు. దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అయితే ఎల్లుండి బొత్స ఎమ్మెల్సీ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ షఫీ ఎందుకు తన నామినేషన్ వెన్నకి తీసుకున్నారు అనేది ప్రస్తుతం చర్చగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news