ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం  సభాపతి అయ్యన్నపాత్రుడు మీడియాతో  చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమావేశాల వరకూ గవర్నర్ ని అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారు. ఈ సమావేశాలకు గవర్నర్ ని రాచమార్గంలో ముందు వైపు నుంచి తీసుకొచ్చాం. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్-2 తలుపులు తీశాం. నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోమని సీఎం సూచించారు.

అలాగే ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 2 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ల్యాoడ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుంది. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశపెట్టనుంది.  88మంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నందున వచ్చే సమావేశాల్లోపు వారికి శిక్షణ ఇస్తాం. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80 శాతం మేర పూర్తయి ఉన్నాయి. 6 నెలల్లోగా వాటిని సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించాను. 9 నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news