ఏపీ విద్యార్థులకు అలర్ట్. నేటి నుంచి అందుబాటులోకి APEAPCET హాల్ టికెట్లు రానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న EAPCET పరీక్షల హాల్ టికెట్ ఇవాల్టి నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ఉదయం 10 గంటల నుంచి ఏపీఈఏపీసెట్-2023 వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. APEAPCET కు మొత్తం 3,37,422 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈనెల 15 నుంచి 19 వరకు… అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23వ తేదీల్లో నిర్వహిస్తారు.