చాట్‌జీపీటీ దుర్వినియోగం.. చైనాలో తొలి అరెస్టు

-

చైనాలో తొలిసారిగా చాట్ జీపీటీ దుర్వినియోగం జరిగింది. దీంతో చాట్ జీపీటీ దుర్వినియోగంపై తొలి కేసు నమోదైంది. రైలు ప్రమాదంపై తప్పుడు వార్తను సృష్టించి, దాన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేసిన ఒక వ్యక్తిని చైనాలో పోలీసులు అరెస్టు చేశారు. చాట్‌జీపీటీ పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసినందుకు ఈ దేశంలో నమోదైన తొలి అరెస్టు ఇదేనని అధికారులు తెలిపారు. నిందితుడి పేరును హాంగ్‌గా వారు వెల్లడించారు.

ఏప్రిల్‌ 25న ఒక లోకల్‌ రైలు ప్రమాదానికి గురైందని, అందులో 9 మంది చనిపోయారని హాంగ్‌ ఒక తప్పుడు వార్తను సృష్టించాడు. బైజియాహో అనే ఆన్‌లైన్‌ వేదికలో 20 ఖాతాల ద్వారా ఈ కథనాన్ని పోస్ట్‌ చేశాడు. దీన్ని గన్సు ప్రావిన్స్‌లోని సైబర్‌ విభాగం పోలీసులు గుర్తించారు. అప్పటికే ఈ కథనానికి 15వేల క్లిక్‌లు వచ్చాయి. బైజియాహోలోని డూప్లికేషన్‌ తనిఖీ వ్యవస్థను ఏమార్చి, బహుళ ఖాతాల ద్వారా తాను ఈ నకిలీ వార్తను వ్యాప్తి చేసినట్లు హాంగ్‌ అంగీకరించాడు. చాట్‌జీపీటీ సాయంతో ఒకే నకిలీ వార్తకు సంబంధించి భిన్న వెర్షన్లను అతడు సృష్టించినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news