ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పోలీస్ అధికారులను బదిలీ చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియామకం చేపట్టింది. ఇందులో నర్సరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవిమనోహర చారి, తిరుపతి ఎస్బీ డీఎస్పీగా ఎం. వెంకటాద్రి, తాడిపత్రి డీఎస్పీగా జనార్థన్ నాయుడు లను ఈసీ పోస్టింగ్ ఇచ్చింది.
తిరుపతి ఈస్ట్ డీఎస్పీగా రవిమనోహరాచారీ నియామకం అయ్యారు. అల్లర్లు అట్టడి చేయడంలో విఫలం అయ్యారంటూ సురేంద్రరెడ్డిపై ఈసీ వేటు వేసింది. అలిపిరి సీఐగా రామరాం నియామకం చేయగా.. తిరుపతి ఎస్బీ డీఎస్పీ వెంకటాద్రి, సీఐగా విశ్వనాథ చౌదరిలను నియమించింది. అలాగే, తాడిపత్రిలో జరిగిన అల్లర్లను కట్టడి చేయడంలో విఫలం అయ్యారంటూ గంగయ్యపై ఈసీ వేటు వేసింది. అతడి స్థానంలో డీఎస్పీగా జనార్థన్ నాయుడిని ఎన్నికల కమిషన్ పోస్టింగ్ ఇచ్చింది. తాడిపత్రి పట్టణ సీఐగా నాగేంద్రప్రసాద్ నియామకం అయ్యారు.