65 ఏళ్లలో చేయలేని పని పదేళ్లలో చేసి చూపించాం : కేటీఆర్

-

బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని అన్నారు. ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి ఆరు నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.

KTR

ప్రయివేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశామని అన్నారు. గత పదేళ్లలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు అని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో తమపై బాగా దుష్ప్రచారం చేశారని అన్నారు. అయితే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా.. తాము చేసిన పనిని చెప్పుకోవడంలో విఫలం అయ్యామని తెలిపారు. గత 65 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన వైద్య కళాశాలలు మూడు మాత్రమే అన్నారు. తాము పదేళ్లలోనే 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. వైద్య కళాశాలల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news