ఏపీ శాసనమండలిలో ముగ్గురు ప్రభుత్వ విప్ ల నియామకం

-

ఏపీ శాసన మండలిలో ముగ్గురు ప్రభుత్వ విప్ ల నియామకానికి జగన్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. శాసనమండలి లో ముగ్గురు ప్రభుత్వ విప్ లను తాజాగా నియామకం చేసింది ఏపీ సర్కార్‌. మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, మెరిగ మురళీధర్, పాలవలస విక్రాంత్ లను ముగ్గురు ప్రభుత్వ విప్ లుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ జవహర్ రెడ్డి.

Infosys launched in AP on October 16 through the hands of CM Jaga

ఇది ఇలా ఉండగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్…పదిన్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనం అవుతారు.

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు సీఎం జగన్‌. ఇవాళ సాయంత్రం ప్రధాని, హోం మంత్రి లతో సీఎం జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు సీఎం జగన్‌. ఎల్లుండి ఉదయం 10 గంటలకు విఙాన్ భవన్ కు చేరుకోనున్న సీఎం జగన్‌… మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version