ఏపీలో రేపు జరిగే ఎస్ఐ ప్రాధమిక పరీక్షకు సర్వం సిద్ధం అయింది. 411 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది పోలీసు నియామకమండలి. 411 పోస్టులకు 1,71,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతోరాష్ట్ర వ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోస్టుకు గరిష్ఠంగా 418 మంది అభ్యర్థులు పోటీ పడుతునారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఎస్ఐ పోస్టుల భర్తీ చేయనున్నారు.
పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తామంటున్న పోలీసు నియామకమండలి.. పరీక్ష కేంద్రానికి అర నిముషం ఆలస్యం అయిన అనుమతి లేదంటుంది నియామకమండలి. ఉదయం 10 గంటల నుండి మొదటి పేపర్ మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు రెండవ పేపర్ ఉండనుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రేపు జరిగే పరీక్ష కేంద్రాలను పరిశీలించారు ఆయా జిల్లాల ఎస్పిలు, ఉన్నతాధికారులు. పరీక్ష వ్రాసేందుకు హజరయ్యే అభ్యర్థులు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి అని తెలిపారు అధికారులు.