సినిమాకు 100 కోట్లు తీసుకునే హీరోలు పన్నులు కడుతున్నారా..? – డిప్యూటీ సీఎం నారాయణ

-

వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వం పై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోల రిమ్యునరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఫిలిం ఇండస్ట్రీపై ఎందుకు పడుతున్నారని అన్నారు. మీరు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చూసుకోవాలని.. పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలని అన్నారు మెగాస్టార్.

దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో అగ్గిరాజేశాయి. దీంతో వైసిపి మంత్రులు ఒక్కొక్కరుగా చిరు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హీరోల రెమ్యూనరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. సినిమా సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు సరిగా పన్నులు కడుతున్నారా..? అని ప్రశ్నించారు.

కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కానీ వారి దగ్గర పని చేసే వారికి తక్కువ జీతం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. పిచ్చికుక్కలన్నీ ఒకటై ఎవరిని కరవాలో తెలియక వాటిని అవే కరుచుకుంటున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి 175 స్థానాలలో పోటీ చేసే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news