ఆనంద‌య్య మందు పంపిణీకి ఏర్పాట్లు.. పంపిణీ ఎప్ప‌టి నుంచి అంటే?

ఎన్నో అనుమానాలు, మ‌రెన్నో మ‌లుపుల త‌ర్వాత ఆనంద‌య్య మందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న కంట్లో వేసే మందుకు అభ్యంత‌రం చెప్పిన ప్ర‌భుత్వం.. మిగ‌తా మందులు వేయ‌డానికి ఓకే చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా అధికారుల సూచనల మేరకు కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో మందు తయారీకి ఆనంద‌య్య‌, అత‌డి అనుచ‌రులు, ప్ర‌భుత్వ అధికారులు క‌లిసి ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్ ను ఏర్పాటు చేయ‌నున్నారు.

ఇందుకోసం బుధ‌వారం(ఈరోజు) ఆనందయ్య భూమి పూజ చేశారు. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుడు ఈ రోజు ఈ భూమిపూజ‌కు వ‌చ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల్లో షెడ్ నిర్మాణం పూర్త‌వుతుంద‌ని ఆనంద‌య్య వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత అక్కడే మందు తయారీని మొదలు పెట్టి… సోమవారం నుండి పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు ఆనంద‌య్య స్ప‌ష్టం చేశారు.