సింహాచ‌లం ఆల‌య చైర్మెన్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. కొత్త పాల‌క వ‌ర్గం నియామ‌కం

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి ఉన్న సింహాచలం ఆల‌య చైర్మెన్ వివాదం ఎట్ట‌కేల‌కు ముగిసింది. న్యాయ స్థానాల తీర్పుతో జ‌గ‌న్ సర్కార్.. సింహాచ‌లం ఆల‌య పాల‌క వ‌ర్గాన్ని నియ‌మిస్తు ఉత్త‌ర్వులు జారీ చేసింది. సింహాచలం ఆల‌య చైర్మెన్ గా.. పూస‌పాటి అశోక గ‌జ‌ప‌తి రాజును నియ‌మిస్తు.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. అలాగే మ‌రో 14 మంది పాల‌క స‌భ్యుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది.

కాగ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా గా నియ‌మించిన ఆల‌య పాల‌క వ‌ర్గం రెండు సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగ‌నుంది. ఇదీల ఉండ‌గా.. వైసీపీ.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. సింహాచలం ఆలయ పాల‌క వ‌ర్గ చైర్మెన్ గా ఉన్న అశోక్ గ‌జ‌పతి రాజును తొలగించింది. అంతే కాకుండా.. సింహాచ‌లం ఆల‌య క‌మిటీ చైర్మెన్ గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూతురు సంచ‌యిత తో పాటు మ‌రి కొంద‌రి స‌భ్యులుగా చేస్తు 2020 ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీనిపై అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. హై కోర్టును ఆశ్ర‌యించారు. చాలా రోజుల పాటు విచ‌ర‌ణ జ‌ర‌గ‌గా.. హై కోర్టు అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా గా పాత ఆల‌య క‌మిటీనే నియ‌మిస్తు.. ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news